*💥పెంచిన గ్రాట్యుటీ బకాయిల విడుదల*
🔹జి.ఒ.యంఎస్. నం 79, తేది 09/05/2017
🔻పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన రూ.200 కోట్ల పెంచిన గ్రాట్యుటీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఇరోజు విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగి పదవీవిరమణ చేసే చివరి నెల ఎంత వేతనం తీసుకుంటారో అంతకు పదహారున్నర రెట్లు పెంచి గ్రాట్యుటీని అప్పటి ప్రభుత్వం చెల్లించేది. గరిష్ఠంగా రూ.8లక్షల వరకు ఉద్యోగులకు అందజేసేది. దీనిని తెలంగాణ ప్రభుత్వం రూ.12 లక్షల వరకు పెంచింది.
*🔻 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2015 ఫిబ్రవరి 28 వరకు పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ బకాయిలను ఈ రోజు విడుదల చేసింది.*