Type Here to Get Search Results !

Rc.No.202/MDM/2015 Mid Day Meals Scheme Automated Monitaring System Through SMS

 
Rc.No.202/MDM/2015 Mid Day Meals Scheme Automated Monitoring System Through SMS

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మధ్యాహ్న భోజనం తీసుకున్న వారి వివరాలను SMS ద్వారా కచ్చితంగా పంపాలని తెలిపే ఉత్తర్వులు

ప్రొసీడింగ్స్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ టి విజయ్ కుమార్ గారి ఉత్తర్వులు Rc.No.202/MDM తేదీ 17/11/2018 ప్రకారము రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాధికారులకు తెలియజేయునది ఏమనగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ఎప్పటికప్పుడు మధ్యాహ్న భోజనం పథకం యొక్క అమలుకు సంబంధించిన ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టం ద్వారా ప్రతిరోజు పాఠశాల నుండి పంపే మధ్యాహ్న భోజనం తీసుకున్న విద్యార్థుల సంఖ్య యొక్క వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే వాటిని సమీక్షిస్తున్నారు. SMS యొక్క వివరాలను వివరాలను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ వారికి నివేదిస్తున్నారు. రిట్ పిటిషన్ (C) NO.618/2013 ప్రకారము.

ఇప్పటివరకు అంద చేయబడిన సమాచారం తెలియజేయునది ఏమనగా తేదీ 15/11/2018 నాటికి 27245 పాఠశాలలకు గాను 21638 పాఠశాలలు అనగా 79.42% పాఠశాలలు మాత్రమే రోజువారి మధ్యాహ్న భోజనం తీసుకున్న వారి SMS వివరాలు పంపుతున్నారు.

కావున అన్ని జిల్లాల విద్యాధికారులకు తెలియజేయునది ఏమనగా ప్రతిరోజు ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టం ద్వారా ప్రతి రోజు మధ్యాహ్న భోజనం తీసుకున్న వారి వివరాలు SMS స్టేటస్ ను మండల విద్యాధికారులు ద్వారా సమీక్షించండి. ప్రతిరోజు కచ్చితంగా అన్ని మండలాల ప్రధానోపాధ్యాయులు తేది 20 11 2018 నాటికి 100% SMS పంపే విధంగా చర్యలు తీసుకోండి.

అత్యంత ప్రాధాన్యత ఈ అంశానికి ఇవ్వండి. ఈ విషయం పట్ల ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా తీవ్రంగా పరిగణించి సంబంధిత జిల్లా విద్యాధికారుల పైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad